వైద్యం వికటించి బాలుడు మృతి…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: నాంపల్లి మండల కేంద్రంలో నీ ప్రైవేట్ ప్రాథమిక చికిత్యాలయంలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. స్థానిక సీఐ నవీన్ కుమార్, ఎస్సై లచ్చిరెడ్డి లు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జాన్ తండాకు చెందిన సపవత్ రత్య, సపవత్ సాలి దంపతుల కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు జశ్వంత్ (13) మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం జలుబు సమస్యతో బాధపడుతూ నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీనివాస చికిత్యాలయంలో చికిత్స కోసం తన తాత భీమ్లా తో వచ్చాడు. ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణ ఇంజక్షన్ వేయడంతో అపస్మారక స్థితికి వెళ్లడంతో వెంటనే జస్వంత్ ను చండూరు తరలించారు. అక్కడ జస్వంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమ కుమారుడు ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వల్లనే మృతి చెందాడని తండ్రి రత్యా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Scroll to Top