ఐలమ్మ పోరాటం తెలంగాణ మహిళలకు ఆదర్శం: ఎంపీటిసీ, సర్పంచ్

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఆదివారం ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గోరిగే సత్తయ్య, సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐన చాకలి ఐలమ్మ ఆనాడు విసునూరు దేశముక్ రజాకార్లతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలను మహిళనను ఏకం చేసి రోకలి బండ కారం పొడి వర్షేలతో తెగించి పోరాటం చేసి రజకర్లను విసునూరి దేశముకులని తరిమికొట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఆశయాలను సాధించాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె చేసిన పోరాటాలకు గుర్తింపుగా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతిలను జరిపించడం సంతోషంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కట్ట ప్రభాకర్, మండలి కృష్ణ, చండూర్ ఎఫ్ఎస్సి డైరెక్టర్ గిరి సత్తయ్య, రజక సంఘం నాయకులు పగిళ్ళ బిక్షం, నర్సింహ, బరిగెల రవి, గోరిగే శంకర్, పబ్బు మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top