నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 07: గత 13 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్లు తమకు కనీస వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెకు సంఘీభావంగా మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 18 గంటలు కష్టపడుతున్న ఆశా వర్కర్లు వెట్టిచాకిరి చేస్తూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు కావునా వారికి కనీస వేతనం ఫిక్స్డ్ గా 18000 ఇస్తూ, ఉద్యోగ భద్రత కల్పిస్తూ కుటుంబానికి ఇన్సూరెన్స్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కచ్చితంగా ఆశా వర్కర్లు ఏమైతే డిమాండ్లు కోరుతున్నారు వాటిని కచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రెస్ట్ తీసుకునే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము బిక్షం, మండల సీనియర్ నాయకులు గాదేపాక వేలాద్రి, దామెర సర్పంచ్ యాదగిరి, నాంపల్లి సంజీవ, టౌన్ అధ్యక్షుడు పానుగంటి వెంకటయ్య గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవతపల్లి అంజి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గాదెపాక సైదులు, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదుల్ల కోటేష్, తేలుకుంట్ల వెంకటరెడ్డి ,వెంకటయ్య తిప్పని ఎల్లారెడ్డి, పన్నాల మల్లయ్య, ఎధుల్ల మహేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు)మండల అధ్యక్షురాలు రామావత్ కవిత, ఉపాధ్యక్షురాలు ఎరుల్ల కవిత, సునీత, లలిత, యాదమ్మ, అనిత, సైదమ్మ, అరుణ, తదితరులు పాల్గొన్నారు