బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి…
సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 10: గృహలక్ష్మి పథకంలో నిజమైన పేదలకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు విమర్శించారు. సంస్థాన్ నారాయణపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఉప్పల లింగస్వామి, సూరపల్లి శివాజీ, కరెంటు బిక్షపతి నాయక్ లు మాట్లాడుతూ నిజమైన పేదలకు ఇండ్లు లేని వారికి గృహలక్ష్మి. పథకంలో ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఆర్థికంగా బలంగా ఉ న్నవారికి గృహలక్ష్మి పథకంలో ఇండ్లను మంజూరు చేయడం సరి అయింది కాదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తమ అన్ని పథకాలను అధిక శాతం తమ కార్యకర్తలకు అందిస్తున్నారని, అందులోనూ డబ్బున్న వారికి ఆర్ధికంగా ఉన్న వారికి మాత్రమే పథకాలు ఇస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ పథకంలో లబ్ధిదారులపై విచారణ జరిపి నిజమైన పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సురపల్లి శివాజీ, ఉప్పల లింగస్వామి, వంగరి రఘు, కరెంటోత్ బిక్షపతి నాయక్, శ్రీను నాయక్, ఆత్కూరి గిరి, ఇంద్రసేనారెడ్డి, గొల్లూరి యాదగిరి, బండమీది కిరణ్, వెలిజాల శ్రీను, రాచకొండ గిరి, ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.