కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నమల్లేష్ యాదవ్…

  • తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన చెంగిచెర్ల బిఆర్ఎస్ నాయకులు
  • కొత్త కిషోర్ గౌడ్,మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్14: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తారీఖున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.ఈ నేపథ్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ కు చెందిన ఉద్యమకారుడు సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్( కెసిఆర్)మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి బిఆర్ఎస్ పార్టీలో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, కానీ నేడు స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు, చులకనగా చూస్తు,సరైన గుర్తింపు ఇవ్వడం లేదని,ఇదే క్రమంలో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు ఉచిత గ్యారెంటీలు,తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి, స్థానిక నాయకుడైన టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర తోటకూర వజ్రేష్ యాదవ్ అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన వంతు కృషి చేస్తానని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది సుముఖంగా ఉన్నారని,మేడ్చల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, రాసాల కుమార్ యాదవ్ రెడ్డి సమక్షంలో బండారి మల్లేష్ యాదవ్, బింగి పాపయ్య యాదవ్,రాజు గౌడ్ శ్రీనివాస్ యాదవ్, సురేందర్ యాదవ్,భూషణ్ యాదవ్, రమేష్,నరసింహ, ఉపేందర్ రెడ్డి, మొదలైన యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Scroll to Top