సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 17: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమైందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపుగా 200 మంది బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేయంగా ముందుకు పోతున్న టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మరింత అభివృద్ధి జరుగుతుందని ధీమానిచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కమటం రాజు, కమటం రవి, నర్సింగ శోభన్, సుమన్, సైదులు లక్ష్మయ్య, నాగేష్, సంతోష్ గౌడ్, శ్రీకర్ యాకూబ్, సోములు, చెన్నమల్లు, శ్రీరాములు, అలివేలు, వెంకన్న, పూలమ్మ తదితరులు ఉన్నారు.