నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 16: సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని దేవత్ పల్లి గ్రామంలో హైదరాబాద్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి దేవత్ పల్లి మీదుగా శర్బాపురం వరకు 5.8 కిలోమీటర్ల రోడ్డును రూ.4.35 కోట్ల నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు , ముష్టిపల్లి గ్రామంలో 11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ పనులకు, నాంపల్లి మండల కేంద్రంలో గల పంచాయతీరాజ్ సబ్ డివిజన్ తాత్కాలిక భవనం ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పరిపాలన దేశంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని అన్నారు. గత దశాబ్దాలుగా దేవత్ పెళ్లిలో రోడ్డు కావాలని గ్రామస్తులు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని కానీ తెలంగాణ ప్రభుత్వం దేవత పెళ్లికి బీటీ రోడ్లు వేసింది అని అన్నారు. తన హయాంలోనే మంజూరైన రోడ్లన్నీ నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు. ముష్టి పెళ్లిలో 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో విద్యుత్ సమస్య లో వోల్టేజ్ సమస్య లేకుండా గృహ అవసరాలకు, రైతులు అవసరాలకు నిరంతరంగా విద్యుత్ సౌకర్యం లభిస్తుందని అన్నారు. మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయంతో సర్పంచులు ఎంపీటీసీలు చిన్న చిన్న పనుల అనుమతుల కోసం మునుగోడుకు వెళ్లి కాలయాపన చేయకుండా త్వరగా అనుమతులు ప్రజా అవసరాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులూ, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.