చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: రక్త దానం చేసి ప్రాణ ధాతలుగా నిలవాలని మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం అయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడవసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సామ్రాట్ వకాడే గోల్డ్ మాన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చేతుల మీదుగా మెగా రక్త దాన శిభిరంను ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ సమాజం పట్ల అతి చిన్న వయసు లో పెద్ద మనసుతో ఆలోచించి ఆయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ స్థాపించిన మురళి అన్నదానాలు,రక్త దానలు చేస్తు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అలాగే నేడు సమాజం లో జరుగుతున్న కల్తీ నీళ్ళు, కల్తీ పాలు, కల్తీ మద్యం, వీటితో కల్తీ అవుతున్న మన రక్తాన్ని, దానం చేసి శుభ్రం చేసుకోవడం ముఖ్యమని అందుకే ఆరోగ్య వంతులు ఏటా 3 పర్యాయాలు రక్తదానం చేయవచ్చునని ఈ రక్తదానం తో మన ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకున్నట్ల వుతుందని తెలిపారు. అనంతరం ఆయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు బోదుల మురళి మాట్లాడుతూ 141 మంది రక్త దాతలు పాల్గొనడం ఎంతో ఆనందాగా ఉందని అందులో మొదటి సారిగా 60 మంది రక్త దాతలు పాల్గొనడం గర్వం గా ఉందని, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత అవసరమైనది, మన మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరమైనది, ఈ కాలంలో చూసుకుంటే ఎంతో మంది యువత గుండెపోటుతో మృతి చెందడం జరుగుతుంది. రక్తదానం చేయడం వల్ల గుండెపోటు, క్యాన్సర్, చర్మ వ్యాధులు, 90 శాతం దరిచేరకుండా ఉంటాయి, ఇప్పుడు లక్షల్లో రక్తం అవసరం పడుతుంది కానీ రక్తదానం చేసేవాళ్లు వందలో వేలలో మాత్రమే ఉన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి రక్త కొరత లేని సమాజాన్ని నిర్మిద్దాం,రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా న్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ సభ్యులు రిజ్వాన్, మీసాల నరేష్, వరగంటి భాను, ప్రకాష్, యాదగిరి, ఉపేందర్ రిజ్వాన్, శ్రీకాంత్ రెడ్డి, తరుణ్, మున్నా, భరత్, నాగరాజు సాగర్ తదితరులు పాల్గొన్నారు.