ఎమ్మెల్యే టిక్కెట్ భూపాల్ రెడ్డికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయోద్దు…

  • కేటీఆర్ బిఫాం ఇవ్వకున్నా ప్రజా ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలో పోటిలో ఉంటాను…
  • నాకు టిక్కెట్ ఇస్తే ధర్మ బిక్షం చరిత్రను పునరావృతం చేస్తా: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్…

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 01: నల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగడాలు మితి మీరి పోయినాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ కెసిఆర్ కు కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కాలానికే భూపాల్ రెడ్డి హృదయం లో అహంకారం పెరిగిపోయిందని, ప్రజల పట్ల నోటి దురుసు పెరిగిపోయిందన్నారు. అధికారం ఆవహించి అధికార పార్టీ నేతలనే చీదరించుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డదన్నారు. పట్టణానికి వంధల కోట్ల నిధులు కేటాయించినా ఏ ఒక్క కౌన్సిలర్ కూడా చిన్న కాంట్రాక్టు ఇవ్వని దుస్థితి భూపాల్ రెడ్డి ది అన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లను పక్కనపెట్టి పక్క పార్టీ కౌన్సిలర్ల వార్డులకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ స్వంత పార్టీ కౌన్సిలర్ లను పక్కన బెట్టి ప్రతిపక్ష పార్టీ కి సంబంధించిన వారి సామాజిక వర్గానికి ప్రధాన కౌన్సిలర్సుతోను మిలాఖత్ ఐ నల్లగొండ సంక్షేమంలో ఎంతో కొంత జరుగుతున్న అభివృద్ధిలో సొంత పార్టీ క్కౌన్సిలర్లకు భాగస్వామ్యం లేకుండా చేసారన్నారు. మరి కొంత మంది రెవిన్యూ ఇతర అధికారులతోను కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, ఆయన అభివృద్ధి చెందుతూ, అధికార పార్టీ కౌన్సిలర్లకు పంగ నామాలు పెట్టినడో లేదో కేటీఆర్ రిపోర్ట్ తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గ బారాస నాయకులు కూడా పైకి మాత్రమే భూపాల్ రెడ్డి మీద ప్రేమ ఒలక బోస్తున్నారన్నారు. భూపాల్ రెడ్డి మీద స్వంతపార్టీ వారికే లోలోపల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న విషయాన్ని కేటీఆర్ గమనించాలన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రజాధరణ ఎంధుకు కొల్పోయినడో కేటీఆర్ పునరాలోచన చేయాలన్నారు. భూపాల్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న సంగతి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తెలువనిది కాదన్నారు. నేను టికెట్ అడగడంలో న్యాయం ఉందన్నారు. నేను ప్రజల హృదయాలలో ప్రేమను సంపాదించుకుంటే, భూపాల్ రెడ్డి ద్వేషాన్ని సంపాదించుకున్నాడు అన్నారు. కేటీఆర్ బిఫాం ఇవ్వకున్నా ప్రజా ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలో పోటిలో ఉంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top