సంస్థాన్ లో ఘనంగా 28 వసంతాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 01: సంస్ధాన్ నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1994-95 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు.. ఇవాళ 28 ఏళ్ల తర్వాత సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జై హిందుపంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఇన్నాళ్లకు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో చెప్పలేని అనుభూతికి లోనయ్యారు, ఆనందంతో ఆలయ్-బలయ్ తీసుకున్నారు. కార్యక్రమం ప్రారంభానికి కొంత సమయం పడుతుందని,సకాలంలో వచ్చిన కొందరు పూర్వ విద్యార్థులు, ఫంక్షన్ హల్ కి దగ్గరలోనే ఉన్న వారు చదువుకున్న పాఠశాల దగ్గరకు వెళ్లి, ఆదివారం కావడంతో పాఠశాలకు సెలవు ఉండడంతో గేటు దగ్గర నుంచె వారు చదువుకునే రోజుల్లో పాఠశాలలో జరిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు..అనంతరం అందరితో కలసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి పనులను, తరగతి గది విషయాలను గుర్తు చేసుకుని సంతోషపడ్డారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఒకరి తర్వాత ఒకరు తమ జ్ఞాపకాలను, అనుభవాలను చెప్పుకుంటూ ముందుకు సాగింది కార్యక్రమం. ప్రపంచంలో స్నేహానికన్నా మిన్న ఏదీ లేదని, స్నేహంలో ఎంతో మాధుర్యం ఉందని 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరొకసారి నిరూపించారు. ఈ కార్యక్రమంలోఅప్పటి ఉపాధ్యాయులు కృష్ణ మూర్తి, పనిహార్, చంద్రమౌళి, మల్లీశ్వరి, ఉషా, సత్యనారాయణ1994 -1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top