- సుమారు 6 కోట్ల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం, ప్రజాసేవ కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి: సిగురు రేణు రవికుమార్ ముదిరాజ్
మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 01: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో సిగురు రేణు-రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 15వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,పాల్గొని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 15వ డివిజన్ అభివృద్ధిలో వెనుకబడిందని,రోడ్లు సరిగా లేక ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,15వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చిగురు రేణు- రవికుమార్ దంపతులు తన దృష్టికి తీసుకు వచ్చారని,వారికి ఇచ్చిన హామీ మేరకు డివిజన్లో పర్యటించి సుమారు 6 కోట్ల నిధులతో సీసీ రోడ్లు ఇస్తున్నామని అన్నారు.అనంతరం రేణు అరవింద్ ముదిరాజ్ మాట్లాడుతూ డివిజన్ ప్రజల అవస్థలు చూడలేక సమస్యలను మంత్రికి విన్నవించామని, అడిగిన వెంటనే నిధులు కేటాయించి సిసి రోడ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డికి మేయర్ సామల బుచ్చిరెడ్డి కి అధ్యక్షుడు మంద సంజీవరెడ్డికి 15వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని,ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పార్టీ కోసం ప్రజల కోసం పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నానని వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు.డివిజన్ వాసులు ఏ సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.