షార్ట్ సర్క్యూట్ గేదే మృతి…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన కూన్రెడ్డి గణేష్ అనే రైతుకు చెందిన గేదె షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందింది. రైతు తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం గేదె గడ్డిని మేస్తుండగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గేదెకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ తో అక్కడికక్కడే మృతి చెందిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 80 వేల నష్టం జరిగినట్లుగా తెలిపారు. రైతునను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Scroll to Top