నిత్యవసర సరుకులు పంపిణి చేసిన నర్రా ప్రశాంత్ రెడ్డి…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన బాకారం సత్యనారాయణ అనే నిరుపేద కుటుంబం, ఆర్ధిక పరిస్థితి బాగోలేదు అని తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకుడు నర్రా ప్రశాంత్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి, పరామర్శించి తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నర్రా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ “నారాయణపురం మండల కేంద్రంలో నిరుపేదలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడారి వినయ్ యాదవ్, దోసర్ల శివ సాగర్, పాశం సాయి, రాసాల విజయ్, నీళ్ళ లింగస్వామి, చిలువేరు మహిపాల్, చిలువేరు రాకేష్, చిలివేరు కిరణ్ రసమళ్ళ విజయ్, బాల్గురి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top