స్వచ్ఛమైన రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలి: మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్…
మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 21: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలోని వివేక్ నగర్ కాలనీలో సోమవారం అన్నపూర్ణ కిచెన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు అభిరుచిలకనుగుణంగా స్వచ్ఛమైన రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలని,భవిష్యత్తులో మరిన్ని అన్నపూర్ణ కాంటీన్ బ్రాంచీలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు కొత్త కిషోర్ గౌడ్ తెలిపారు.ఈ ప్రారంభోత్సవంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆసర్ల బీరప్ప,వివేక్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి,డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.