నాంపల్లి, ప్రప్రజానేత్రం, ఆగస్టు 23: తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా ఉంటాయని బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు బత్తుల విజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషం వ్యక్తం చేస్తూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని అన్నారు . దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అమలైతున్న సంక్షేమ పథకాలు ప్రజలను మరింత బిఆర్ఎస్ పార్టీకి దగ్గర చేరుతున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మూడవసారి బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించుకొని మునుగోడును మరింత అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి కార్యకర్తలుగా తము కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జెల్లెళ్ళ సైదులు, ఎరుకల సత్తయ్య,ఎరుకల పెద్దయ్య, కమిశేట్టి సంతోష్ తదితరులు ఉన్నారు.