బోడుప్పల్ ఏఆర్ఆర్ కాలనీలో వినాయక మండపం ప్రారంభోత్సవం: పాల్గొన్న కొత్త కిషోర్ గౌడ్

మేడిపల్లి, ప్రజానేత్రం సెప్టెంబర్ 20: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్15వ డివిజన్ పరిధిలోని ఏఆర్ఆర్ కాలనీలో నూతన వినాయక మండపం ప్రారంభోత్సవం బుదవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. వినాయక మండప నిర్మాణానికి సహకరించిన దాతలు కొత్త కిషోర్ గౌడ్, అమ్మసాని సుధాకర్ రెడ్డిలకు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్,సంపత్, శ్రీనివాస్,రంజిత్ కాలనీ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు,కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top