మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మండల ఏఐటీయూసీ కార్యదర్శి దండు రమేష్ అధ్యక్షతన మేడిపల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు బుదవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మేడిపల్లి మండల సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవగలపై దక్షిణమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు అనంతరం తాసిల్దార్ హసీనాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రచ్చ కిషన్,పుట్ట లక్ష్మణ్,మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి అని, ప్రభుత్వ భూములను పరిరక్షించి,భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి మండలంలోని బోడుప్పల్,పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లలో నిరుపేదలు కూలి పనులు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు.వారు ప్రభుత్వం అందించే డబల్ బెడ్రూంలో కొరకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు.కానీ అర్హులకు ఇవ్వకుండా హైదరాబాద్ పట్టణంలో నివసిస్తున్న వారికి కేటాయించారు. దీంతో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది.కావున వెంటనే అర్హులైన స్థానికులకు కేటాయించాలని, ప్రభుత్వం ప్రకటించిన 58,59 జీ.వో,లలో దరఖాస్తు చేసుకున్న వారి నుండి అధికంగా వసూలు చేస్తున్నారని కట్టని వారిపై రెవెన్యూ అధికారులు కూల్చివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.వెంటనే వాటిని ఆపివేయాలని కోరుతున్నాం.జంట కార్పొరేషన్ లో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని స్థలాలను పరిరక్షించాలని సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు వి.బి బాలరాజ్,మహిళా సమాఖ్య మండల కార్యదర్శి సి.హెచ్ మాధవి, బి కే ఎం యు అధ్యక్షులు భూతం ఐలయ్య,సిపిఐ పార్టీ మండల నాయకులు ఇస్తారి, జి నాగరాజు, మాచర్ల కనకయ్య, బొందయ్య, మేకల లక్ష్మి, లక్ష్మమ్మ, నర్సమ్మ,సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.