పెట్రోలియం ట్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…


మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 15: తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్స్ ఐఓసిఎల్ డ్రైవర్,క్లీనర్,వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్( బాబు) ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచుకునే ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకుని వారికి నివాళులర్పించారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ అధికారులను సన్మానించి పూల మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో బాబు, ఉపేందర్, మనోహర్ రెడ్డి, వై శ్రీకాంత్, బొట్టు శీనన్న, శ్రీకాంత్, చంద్రమౌళి, శేఖర్, ఆంజనేయులు, కిరణ్, ఉమామహేశ్వర శివకుమార్, కొండల్, వెంకటేష్, సురేందర్, కృష్ణారెడ్డి, కుమార్, రవి, జంగయ్య, రాజిరెడ్డి, కుమార్, కనకయ్య ,శీను, సంపత్ జేమ్స్త దితరులు పాల్గొన్నారు.

Scroll to Top