కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి: ఆకుల ఇంద్ర సెనారెడ్డి

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 15: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనా రెడ్డి అన్నారు. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన 7, 8 వార్డుల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అద్యక్షులు, కార్యవర్గానికి చౌటుప్పల బ్లాక్ కాంగ్రెస్ అభ్యర్థులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ గౌడ్ ల చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్ర సెనా రెడ్డి మాట్లాడుతూ పార్టీ పూర్వవైభవం కోసం ప్రతి కృషి చేయాలని, త్వరలో రానున్న ఎన్ని కలలో చలమల్ల కృష్ణా రెడ్డి నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసెందుకు శక్తి వంచన లేకుండా అహర్నిషలు శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ దేవెందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శులు కేతరాజు అచ్చయ్య, జిల్లా ఐఎన్టీయుసి నాయకుల లందగిరి బీమయ్య, మున్సిపాలిటి ఉపాధ్యులు పాషం క్రిష్ణ, ప్రధాన కార్యదర్శి పందుల రాజేష్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు మాదగాని శేఖర్ గౌడ్, పట్టణ యూత్ అద్యక్షులు పెలుగు రాంబాబు, బ్లాక్ ఎస్సీ, ఎస్టీ సెల్ అద్యక్షుడు ఊదరి నర్సింహ, కరంటోతు శ్రీనువాస్ నాయక్, వార్డు అధ్యక్షులు దొనకొండ క్రిష్ణ, ఎండీ వశీం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top