మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 15: మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులను అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం భారతదేశంలోని ఏ రాష్ట్రములో లేదని అలాగే పెళ్లి ఖర్చులకు ఒక లక్ష రూపాయలు ఆడ బిడ్డలకు మేనమామ లాగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. ప్రసవం తరువాత కెసిఆర్ కిట్టు కింద వారికీ సరిపడా సబ్బులు సరుకులు కూడా అందచేస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం. 2014కు ముందు ప్రభుత్వ హాస్పిటల్ కు పోవాలంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. అలాగే న్యూట్రిసియన్ కిట్లు, గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా మహిళలకు అందచేయలేదన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తరువాత చాలా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకీ 3గంటల కరెంట్ చాలు అని చెప్తుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రము వచ్చిన తరువాతనె రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే. 3గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల 3పంటలు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top