నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 21: మండలంలోని బెండల పహడ్ గ్రామ పంచాయితీ ఆవాస గ్రామం బాగిగుడెం చెందిన కాంగ్రేస్ పార్టీల నాయకులు కార్యకర్తలు 50 మంది సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో వంగాల సాయి చరణ్, వంగాల శేఖర్, వంగాలసంజీవ, వంగాల నర్సింహా, వంగాల హనుమంతు, వంగాల నాగ స్వామి, వంగాల నరేందర్, వంగాల శ్రీను, మన్నే శివాజీ, వంగాల మహేందర్, వంగాల వెంకన్న, వంగాల మారయ్య, వంగాల స్వామి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో షాపెల్లి గ్రామ సర్పంచ్ కర్నాటి ఉపేందర్, బెండల పహాడ్ గ్రామ సర్పంచ్, శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ వి నియోజకవర్గ మాజీ ప్రధాన కార్యదర్శి చినపాక. రమేశ్, మాజీ సర్పంచ్ రాందాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.