చండూర్, ప్రజానేత్రం, డిసెంబర్ 30: చండూర్ మండల పుల్లెంల గ్రామంలోని శనివారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల దృష్ట్ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సహకారంతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను నేడు కస్తూరి ఫౌండేషన్ సభ్యులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చదివే నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండషన్ పనిచేస్తుందని తెలిపారు.కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రములోని కొన్ని వందల ప్రభుత్వ పాఠశాలల ను మరమ్మత్తులు చేసి,మౌలిక వసతులు కల్పించడం జరిగింది.విద్యార్థులు శ్రద్దగా చదువుకొని రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్లు సంపాదించి,వారి తల్లిదండ్రులకు మరియు వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకరావాలని కోరారు అదే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు.ఈ సందర్బంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి ఫౌండేషన్ సభ్యులు శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి,శ్రీ సమ్మిడి నవీన్ రెడ్డి,శ్రీ పెసర్ల హరీష్,శ్రీ ఇరిగి శివ,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీ రాపోలు లక్ష్మీనారాయణ,ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.