కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి: బీఎస్పి పార్టీ మండల మహిళా కన్వీనర్ కక్కిరేణి శిరీష

రామన్నపేట, ప్రజానేత్రం, సెప్టెంబర్ 21: తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యజించిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 90 సంవత్సరాల వయసులో తెలంగాణ సాధన కోసం గడ్డకట్టే చలిలో ఢిల్లీలో ఉద్యమం చేసిన ఘనత ఆయనది. ఆ మహనీయుడి సేవలు తెలంగాణకే గర్వకారణమని బిఎస్పి మహిళా మండల కన్వీనర్ కక్కిరేణి శిరీష అన్నారు.భారత స్వాతంత్ర పోరాట, తెలంగాణ ఉద్యమ నేత, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా రామన్నపేట లో మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితాంతం బలహీన వర్గాల కోసం సేవ చేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు.గాలి, నీరు ఉన్నంత వరకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక్క కులానికో.. మతానికో చెందిన వారు కాదని, ఆయన యావత్ తెలంగాణకే ఆస్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షులు గునిరాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ, కోశాధికారి గట్టు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top