గ్రామంలో పారిశుధ్యం ఏమాత్రం పట్టించుకోని ప్రజాప్రతినిధులు

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 21: అ గ్రామంలో పారిశుధ్యం ఏ మాత్రం పట్టించుకోని సర్పంచ్ నాంపల్లి మండల పరిధిలోని దేవతపల్లిలో పారిశుధ్యం ఆస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బజార్లలో వాన నీరు నిలిచి చెరువుల మాధురి దర్శనమిస్తున్నాయి వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిల్వ ఉన్న వాన నీటిలో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో గ్రామస్తులకు రాత్రి సమయంలో కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు అదే కాకుండా దోమలతో మలేరియా డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, గత సంవత్సరం నుండి దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్యం కోసం లక్షల రూపాయలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక టాక్టర్ మంజూరు చేసినప్పటికీ చిన్నపాటి మరమ్మతులు చేయించకపోవడంతో సర్పంచ్ నిర్లక్ష్యానికి గురైన ట్రాక్టర్ గ్రామపంచాయతీ ముందు తుప్పు పట్టి పోతుంది…

Scroll to Top