ఇరు పార్టీల మధ్య ముదురుతున్న వివాదం కిరణ్ కుమార్ రెడ్డి మంద సంజీవరెడ్డికి క్షమాపణ చెప్పాలి బోడుప్పల్ బిఆర్ఎస్ నాయకులు డిమాండ్…
మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 21: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఒకరిపై ఒకరు మీడియా సాక్షిగా విమర్శలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.బిజెపి కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బోడుప్పల్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటమిలో సహజమని,మంద సంజీవరెడ్డి ఓటమిపై కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న ప్రజాసేవకుడు మంద సంజీవరెడ్డి అని, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వక్బోర్డ్ సమస్యకు శక్తివంచన లేకుండా సంజీవరెడ్డి కృషి చేస్తున్నాడని, తన రాజకీయ లబ్ధికోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే మంద సంజీవరెడ్డిని విమర్శిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి, తక్షణమే మంద సంజీవరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేదంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కిరణ్ కుమార్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీరాల బిఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డి, కొత్త చక్రపాణి గౌడ్, జడిగే రమేష్, రాములు, దాన గళ్ళ యాదగిరి, బొమ్మకు విశ్వనాథ్, బీఆర్ఎస్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.