పదవ వార్షికోత్సవం సందర్భంగా గణపతి హోమం అన్నదాన కార్యక్రమం పాల్గొన్న కార్పొరేటర్లు కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, సింగిరెడ్డి పద్మా రెడ్డి…
బోడుప్పల్, ప్రజానేత్రం సెప్టెంబర్ 21: బోడుప్పల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలోని అనఘాపురి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు. నాలుగో రోజు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి హోమం,అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.వేద పండితులు మహదేవభట్ల శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో 10వ వార్షిక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. అన్నదాత ఎర్రోజు సోమలక్ష్మి- యాదగిరి చారి సహకారంతో సుమారు 500 మందికి అన్నదానం చేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను,భక్తి భావాన్ని పెంపొందిస్తాయని,ముఖ్య అతిథులు అన్నారు.ఈ కార్యక్రమంలో అనఘాపురి కాలనీ అధ్యక్షులు వెల్లెంకి జయపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు ఉమ్మడోజు యాదగిరి చారి,ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఆకుల సదాశివ, సమన్వయకర్త మెంతెన అబ్బసాయిలు, సంయుక్త కార్యదర్శులు కొంగరి సంతోష్, గండ్రతి శ్రీనివాస్, సాంస్కృతిక కార్యదర్శులు సామ రాంరెడ్డి, పల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గోలి వెంకటేష్, సతీష్ చంద్ర విశ్వకర్మ, ఆకిటి సుధాకర్ రెడ్డి, పెరుమాళ్ళ సత్యనారాయణ, మట్ట షెట్టయ్య, గ్రీన్ సిటీ కాలనీ అధ్యక్షులు చామల బిక్షం రెడ్డి,వాకిటి శ్రీనివాస్ రెడ్డి, కాలనీ మహిళలు,వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.