అగ్రకులల పార్టీలకు బానిసలం కాదు మహనీయుల వారసులం

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 22: మహనీయుల పొలిటికల్ ప్రింట్ ఈనెల 25న చండూర్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరణ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గణం నరసింహా కురుమ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహనీయుల పొలిటికల్ ప్రింట్ మునుగోడు నియోజకవర్గ చైర్మన్ మల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేందర్ యాదవ్, చండూర్ మండల కేంద్రం లో రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు మహిళ సంఘాలు మేధావులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కాటేపల్లి వెంకటేష్ గౌడ్,బిజెపి జిల్లా కార్యదర్శి సూరపల్లి శివాజీ, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మాజీ అధ్యక్షులు రత్తుపల్లి యాదయ్య,నాయకులు బైకన్ నరేందర్ యాదవ్,బీఎస్పీ నియోజకవర్గ నాయకులు ఈసం సోమేశ్వరం,కోడూరు నరసింహ,నిమ్మల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top