బోడుప్పల్ ఆర్టీసీ కాలనీలో అన్నదానం: పాల్గొన్న కొత్త చందర్ గౌడ్, కొత్త కిషోర్ గౌడ్

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 22: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాడవాడల గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ఫేస్-02 లో “అన్నదాన” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసర్ల బీరప్ప,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గణేష్ నాయక్,కాంగ్రెస్ నాయకులు రామగళ్ళ నర్సింగరావు,ఆర్టీసీ కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top