బోడుప్పల్లో” హెల్త్ సిటీ హాస్పిటల్” ప్రారంభోత్సవం: ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 22: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎం వి ఆర్,కేఏఆర్ యాజమాన్య సౌజన్యంతో “హెల్త్ సిటీ హాస్పిటల్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ పాల్గొని ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ దళిత బహుజనులు అన్ని రంగాలలో విజయం చెల్లించాలని, వైద్యరంగంలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన హెల్త్ సిటీ హాస్పటల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు.బోడుప్పల్ ప్రజలకు నిస్వార్ధంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలని హెల్త్ సిటీ హాస్పిటల్ ప్రారంభించామని, బోడుప్పల్ పాఠశాల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు స్థానిక ప్రజలు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Scroll to Top