- 60 లక్షల నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
- గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం మంత్రి మల్లారెడ్డి
- డివిజన్ అభివృద్ధికి నిరంతర కృషి: కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్
మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 01: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగో డివిజన్ గ్రీన్ సిటీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో పలు సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, ఐదవ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి రెడ్డి పద్మా రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ స్రవంతి గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలలో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజ్ పండ్లు పూర్తయ్యాయని,విడతల వారీగా సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని,ముందుగా గ్రీన్ సిటీ కాలనీ లోని పోచమ్మ ఆలయం వెళ్లే ప్రధాన రోడ్లను సుమారు 60 లక్షల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశామని, త్వరలోనే కాలనీలలోని లింకు రోడ్లు కూడా పూర్తి చేస్తామని, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదర్శవంతమైన కాలనీగా గ్రీన్ సీట్ కాలనీ ఉండే విధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం క్రీమ్ శెట్టి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చామల బిక్షంరెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కార్పొరేటర్ కు మేయర్ కు మంత్రి మల్లారెడ్డి కి కాలనీ కాలనీవాసుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, గ్రీన్ సిటీ కాలనీ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని బోడుప్పల్లో మోడల్ కాలనీగా గ్రీన్ సిటీ కాలనీ ఉండే విధంగా కృషి చేస్తున్నామని అందుకు సహకరిస్తున్న కాలనీవాసులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోగౌరవ అధ్యక్షుడు చిన్నం బీరప్ప కురుమ, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ళ శ్రవణ్ కుమార్ గౌడ్,ఉపాధ్యక్షులు పడకంటి నరసింహ్మ చారి ,అప్పిడి వెంకట్ రెడ్డి కోశాధికారి రేగు శేఖర్,జాయింట్ సెక్రెటరీ బొడ మల్లేశం,వాకిటి శ్రీనివాస్ రెడ్డి,కోయగుర నారాయణ గౌడ్,దాసు, సురేష్,అంతటి శ్రీనివాస్ గౌడ్, ఆమనగంటి సత్యనారాయణ రెడ్డి, చిలుక బావనందు లోంక శ్రీనివాస్, మైస పవన్,భూమండ్ల వేణు,సైదులు కృష్ణ,శేఖర్,శ్రీనివాస్ ,రామసత్తయ్య మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.