నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 25: మండలంలోని ఎం. ఎడవెల్లి, చిప్పలపల్లి గ్రామాల్లో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానకి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. కెసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, స్ధానిక ఎంపిపి సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్ధానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.