మునుగోడు, ప్రజానేత్రం, జూలై 08:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో సోమవారం డాక్టర్ వైయస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మాజీ ఉప సర్పంచ్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ లు మాధగోని రాజేష్ గౌడ్, జక్కల శ్రీను, మేడి యాదయ్య, జంగిలి నాగరాజు, మాదగోని దేవలోకం బండారు మల్లేష్, జిట్టగోని సైదులు, కాటం వెంకన్న, బొల్లం మహేష్, దండు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.