నీట్ ని రద్దు చేసీ రీ నీట్ వెంటనే నిర్వహించాలి

న్యూ ఢిల్లీ, ప్రజానేత్రం, జూన్ 27: యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 500 మందికి పైగా రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి పాల్గొనగా, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి దాదాపు 10 మంది యువజన కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీటింగ్ రద్దుచేసి వెంటనే రీ నీట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు వెంకటేష్, రమేష్, సుభాష్, దొంతి సాయి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top