కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, ఆగష్టు 29: నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో వెంకటేశ్వరా నగర్ వెస్ట్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టకరం అన్నారు. ప్రజలపై స్వామివారి చల్లని చూపు ఉండాలని ప్రార్ధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ని, యోజకవర్గ యూత్ అద్యేక్షులు, డివిజన్ల అధ్యక్షులు, స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.