కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 15: కుత్బుల్లాపూర్ పరిధిలోని మాణిక్య నగర్ లో రూ.88.30 లక్షలతో వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని శుక్రవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1.07 కోట్ల నిధులతో పూర్తయిన కల్వర్టు పైన ఇపుడు బ్రిడ్జి నిర్మించిన నేపథ్యంలో గతం లో భారీ వర్షాలకు వరద నీరు నిలువ ఉండేది అని దీనికి శాశ్వత పరిష్కారం కోసం కల్వర్టు వెడల్పు చేసి బ్రిడ్జి నిర్మించాం అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేటీఅర్ సహకారంతో ఎటువంటి నిధుల కొరత లేకుండా నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తిలలో మౌలిక వసతులు కల్పించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్, డివిజన్ అద్యేక్షులు దేవరకొండ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ సత్తిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.