భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి జగధీష్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో భూమిని కోలిపోతున్న భూ నిర్వాసితులకు ప్రభుత్వం బాసటగా అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా లోని కలెక్టర్ కార్యాలయంలో నాంపల్లి మండల పరిధిలోనీ ఎస్ డబ్ల్యూ లింగోటం పంచాయతీ పరిధిలో గల లక్ష్మణపురం ప్రాజెక్టు భూ నిర్వాసితులతో ఆయన భేటీ అయ్యారు. అక్కడి నుండి నల్గొండ జిల్లా కలెక్టర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. భూ నిర్వాసితులకు పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి తో మాట్లాడుతూ నిర్వాసితుల కోరిక మేరకు పునరావాస చర్యల చేపడుతామని అన్నారు. నిర్వాసితులు రంగారెడ్డి జిల్లా సమీపంలో తమకు నివాస కేంద్రాలు నిర్మించి ఇవ్వాలని తెలియజేయగా ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వారికి అనుకూలమైన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదోడ్ల రవీందర్ రెడ్డి, ఏడుదోడ్ల ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top