సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా సంస్ధాన్ నారాయణపురం ఎంపికైన సందర్భంగా, గ్రామ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరిని అభినందిస్తూ, సన్మానించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. వారు మాట్లాడుతూ ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందుతున్న సంస్థాన్ నారాయణపురం గ్రామాన్ని మరెంతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. గ్రామంలో పారదర్శకత పాలన సాగిస్తూ, గ్రామస్తుల మన్నలను పొందుతూ,ఉత్తమ గ్రామ పంచాయతీగా గ్రామాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సర్పంచ్ శ్రీహరిని అభినందించి,ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లలమర్రి శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.