సీఎం సహాయ నిధి అందజేత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నలపరాజు నర్సింహ కు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష రూపాయల ఎల్ఓసి నీ గురువారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నలపరాజు రమేష్, వీరమల్ల మహేష్, కత్తుల శ్రీకాంత్, ఒంటెద్దు లింగస్వామి, మలిగే బాలకృష్ణ, బాలాగొని సుమంత్, రాయిని అఖిల్, బాలాగోని శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top