- బీజేవైఎం మండల అధ్యక్షులు సతీష్
నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 04: మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఇవాళ నాంపల్లి మండల పర్యటనలో భాగంగా ఎక్కడ అడ్డుకుంటారో అనే భయంతో ముందస్తుగా బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరులకు లేదా తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నిరసన తెలిపే హక్కు లేనట్లు తెలంగాణా రాష్ట్ర మంత్రి పోలీస్ వారితో ముందస్తు అరెస్ట్ లు చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి ప్రతిపక్ష బీజేపీ కి మరోనీతి అన్నట్లు వ్యవహారిస్తున్నారు. తెలంగాణా పోలీస్ వారు. ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండ ఈ చర్యలను ప్రతిఘటిస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్ట్ చేయానిదే పర్యటన చేసే పరిస్థితులలొ లేరు మంత్రులు, ఎమ్మెల్యేలు అని అన్నారు. వారు నిజంగా అభివృద్ధి చేసిన వాళ్ళు అయితే అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని నినాదాలు చేశారు.