మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేశారు

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 27: మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేశాయని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు ఆరోపించారు. ఆదివారం యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గం రివ్యూ మీటింగ్ చండూర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ని మునుగోడు నియోజకవర్గం లో బలోపేతం చెయ్యటానికి ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడు కృషి చెయ్యాలని కోరారు. అలాగే యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో నే మునుగోడు ని మొదటి స్థానంలో నిలిపెందుకు ప్రతి మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు విస్తృతంగా కంపెయిన్ నిర్వహించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకు రావటంలో యువజన కాంగ్రెస్ పాత్ర ఉండే విదంగా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, మునుగోడు మండల అధ్యక్షులు నక్క వెంకన్న, చండూర్ మండల అధ్యక్షులు పెండ్యాల విష్ణు, నారాయణపురం మండల అధ్యక్షులు దేపా ప్రవీణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శివ లింగం, నాంపల్లి మండల అధ్యక్షులు అంజి యాదవ్, మర్రిగూడ మండల అధ్యక్షులు బెతి వెంకట్ యాదవ్, గోసుకొండ స్వామి, వినయ్, ప్రవీణ్, వెంకట్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top