ప్రజానేత్రం, ఘట్కేసర్ ప్రతినిధి, ఆగష్టు 29: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో శాంతి యూత్ కమిటీని పోచారం బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ ఆధ్వర్యంలో 14వ సంవత్సరం ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శాంతి యూత్ అధ్యక్షునిగా వరిగడ్డ అజయ్ కొమ్ము పవన్ జట్టంగి ప్రశాంత్,మహేష్ సయ్యద్ అప్సర్ ఖాన్ ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా యూత్ వింగ్ అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన శాంతి యూత్ అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత అందర్నీ వివిధ యువజన సంఘాలను కలుపుకొని పోవాలని శాంతి యూత్ సభ్యులంతా కలిసికట్టుగా ఒకే మాటపై ఉండాలని సేవా మార్గాల్లో ముందుండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాంతియుత్ సభ్యులతో పాటు కాలనీవాసులు యువకులు పాల్గొన్నారు.