మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎంపీపీ శ్వేత

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 26: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపులో భాగముగా కోటి వృక్షార్జన కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత స్వాముల వారి లింగోటం గ్రామంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాల్సిందిగా బాధ్యత ప్రతి ఒక్కరూ పైన ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ కుమార్, స్థానిక ఎంపీటీసీ బెక్కం రమేష్, సర్పంచ్ అంగిరేకుల పాండు, పంచాయతీ కార్యదర్శి జావేద్, ఉపసర్పంచ్ ఆవుల వెంకటయ్య, వార్డ్ మెంబర్లు గడ్డి పుల్లయ్య, గుండు రఘుపతి ,అన్నపాక ఈదయ్య, గడ్డి అంజయ్య ,అటవీ శాఖ సిబ్బంది ,ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు

Scroll to Top