ప్రగతి యాత్రకు ప్రజా ఆదరణ:131 డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ప్రగతి యాత్రలో భాగంగా 110వ రోజు బుదవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా మహేంద్ర నగర్, కాకతీయ నగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అన్నీ అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని హామినిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతోప్రతి కాలనీలో అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కాలనీ లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించి విజ్ఞేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ అద్యక్షులు దేవరకొండ శ్రీనివాస, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు ఎం శ్రీనివాస్ రెడ్డి, వీ ఎస్ ఆర్ కె ప్రసాద్, పోచయ్య, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, మల్లయ్య, దుర్గ ప్రసాద్, మధుసూదన్ రావు, శ్రీనివాస్ రావు, సుబ్బారావు, శ్రీనివాస్ పంతులు, బి వీ రావు, సత్యనారాయణ, స్వామి, మల్లేష్, మనోహర్ రావు, గంగాధర్, ఇబ్రహీం, కృష్ణ రెడ్డి, ఎన్నా రెడ్డి, భూపాల్ రెడ్డి,నజీర్, గోపాల్ రెడ్డి, రాఘవులు, శ్రీనివాస్ రెడ్డి, సజ్జు బాపన్, నీలిమ, సింధు,స్వప్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top