మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 17: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్లోని వివిధ కాలనీలో రహదారులు గుంతల మయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ డివిజన్ లో సిసి రోడ్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్రవంతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ లక్ష్మీ నగర్ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ,లెక్చరర్స్ కాలనీ, వివేక్ నగర్ కాలనీ,అనగాపూర్ కాలనీ, యాదాద్రి మొదలైన కాలనీలలో రోడ్లు సరిగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని నూతన సిసి రోడ్లు సాంక్షన్ చేయవలసిందిగా కమిషనర్ కు విన్నవించామని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.