నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 20: కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని వడ్డేపల్లి గ్రామంలో శనివారం ఆదివారం గృహలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరిశీలన విజయవంతముగా ముగిసిందని సూపర్వైజర్ ఈ శ్రీలత, జూనియర్ అసిస్టెంట్ తెలిపారు. వీరు వెంట గ్రామ సర్పంచ్ బుషిపాక లీలా ప్రియా నగేష్, స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు జి సంధ్య, కే శంకర్, వార్డ్ మెంబర్ బుషిపాక వెంకటేశ్వర్లు, కోఆప్షన్ నెంబర్ ఊరి పక్క వెంకటయ్య, బుషిపా క జగన్, జడ ప్రశాంత్, పరిశీలనకు స్థానికులు సహకారం అందించారని తెలిపారు.