మునుగోడు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో 1వ వార్డు శ్రీ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయకుని లడ్డూ వేలం ఆ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 36,016 రూపాయలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ గ్రామ మిల్క్ సెంటర్ చైర్మన్ జనగల ముత్యాలు-రేణుక దంపతులు కైవసం చేసుకున్నారు. ప్రజలంతా సిరిసంపదలతో సుఖశాంతులతో ఉండాలని ఆ విగ్నేశ్వరుడుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రసాద్, సైదులు, వెంకన్న, నరేష్, స్వామి, సత్యనారాయణ, అనిల్, హరికృష్ణ, స్వామి, శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.