బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లేదని నాయకుల ఆవేదన….

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 01: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో భాజపా నుండి బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తు ఆదివారం సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గెలుపుకు ఎంతో కష్టపడిన గెలిచిన తర్వాత పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే, స్థానిక నాయకులు తీరు మార్చుకుంటే బాగుంటుందన్నారు. తమ భవిష్యత్ ప్రాణాలక పై సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి మాజిద్, మాజీ బీజేపీ బిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని నరేందర్ గౌడ్, నాయకులు పెంబల్ల జానయ్య, బండారు యాదయ్య, రమేష్, రాజేశ్, అంతి రెడ్డి, నర్సింహ, స్రవంతి తదితరులు ఉన్నారు.

Scroll to Top