తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 60 ఏండ్ల కళ: బీఆర్ఎస్ యువ నాయకులు ఉప్పరి విజయ్

తెలంగాణ ప్రజలను అగౌరవ పరచిన నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి…

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ యువ నాయకులు ఉప్పరి విజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని,అమరవీరుల త్యాగాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నాయని, అనేక మంది తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు,ప్రాణత్యాగాలు చేసి కెసిఆర్ సారథ్యంలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం.సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ విభజన హామీ చట్టంలో తెలంగాణకి రావాల్సిన విద్యాసంస్థలు,పరిశ్రమలు,నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ,తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం,నేడు ప్రధానమంత్రి హోదాలో ఉండి రాష్ట్రాల విభజన సహేతుకంగా లేదని చెప్పడం సిగ్గుచేటు.తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల పట్ల , జరుగుతున్న అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటె నరేంద్ర మోడీ మాటలను ఖండించాలని డిమాండ్ చేస్తున్నాం అని నరేంద్ర మోడీ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు,అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Scroll to Top