బోడుప్పల్ 5వ డివిజన్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలు…

పలు కాలనీలలో విగ్నేశ్వరున్ని దర్శించుకున్న కార్పొరేటర్ సింగిరెడ్డి…

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: వినాయక చవితి సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి డివిజన్ పరిధిలోని భీమ్ రెడ్డి నగర్,ఎన్ ఐ ఎన్ కాలనీ,బుద్ధ నగర్,ఐఐసిటి కాలనీలలో గణేష్ మండపాలను సందర్శించి వినాయకుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరూ పైన ఉండాలని, కుటుంబ సమేతంగా వినాయక ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పలు కాలనీలా అధ్యక్ష, కార్యదర్శులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top