ఫ్యాషన్ డిజైనింగ్ లో భారత ఆణిముత్యం..

దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన ఒకే ఒక్క బంజారా ముద్దుబిడ్డ….

ఫ్యాషన్ డిజైనింగ్ లో విదేశాలలో వారం రోజులు పాల్గొనడానికి అవకాశం దక్కించుకున్న కుమారి వర్షా నాయక్.

హైదరాబాద్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: పిల్లలు పుట్టినప్పుడు కాదు ఆ పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారై పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు ఆ తల్లిదండ్రులు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది అలాంటిది ఫ్యాషన్ డిజైనింగ్ లో భారతదేశ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క బంజారాల ఆణిముత్యం వర్షా నాయక్.దేశవ్యాప్తంగా ఫ్యాషన్ డిజైనింగ్ కి ఎన్నికైన 13 మందిలో దక్షిణ భారతదేశ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క బంజారాల ఆణిముత్యం రఘు నాయక్ రుడావత్ కూతురు… ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ కుమారి వర్షా నాయక్ రుడావత్. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ప్యారిస్ లోని మిలాన్ లో ఈ నెల19న ప్రారంభమై 25వ తేది వరకు వారం రోజులపాటు జరగబోయే మిలాన్ ఫ్యాషన్ వీక్ తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చే ఫ్యాషన్ డిజైనర్లు వారి వారి ప్రత్యేక వస్త్రధారణలను ప్రపంచానికి పరిచయం చేస్తారు.ఇంతటి అద్భుతమైన ఫ్యాషన్ డిజైనింగ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు యావత్ బంజారా సమాజం తరఫున ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నా యి. వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడి రాను రాను ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్న సొంత సంస్కృతి సాంప్రదాయ వస్త్ర ధారణను మరచిపోతున్నది నేటి సమాజం.ఎలాగైనా మన వస్త్రధారణ సంస్కృతి

సంప్రదాయాన్ని కాపాడాలన్నది నా లక్ష్యం: వర్షా నాయక్
మనం ఇతరుల వస్త్ర సంప్రదాయాలను అనుసరించడం కాదు – మన బంజారా సాంప్రదాయ వస్త్రధారణను ఇతరులు కూడా ధరించే విధంగా దాని గొప్పతనాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచాని కి చాటి చెప్పేందుకు అరుదైన రంగాన్ని ఎంచుకుని ధైర్యంగా ముందుకు అడుగులు వేశారు కుమారి వర్షానాయక్.తెలంగాణ రాష్ట్రం మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన కుమారి వర్షానాయక్ కు ఈ అవకాశం రావడం ఎంతో గర్వించదగినది. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆమె పడుతున్న శ్రమను కృషిని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన విషయము. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లో కూడా బంజారాల వస్త్రధారణ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆమెకు మరెన్నో అవకాశాలు రావాలని జనం కోరుతున్నారు.

Scroll to Top